ఒకే కుటుంబంలో 11 మందికి కరోనా..!

Thursday, April 2, 2020 07:18 AM News
ఒకే కుటుంబంలో 11 మందికి కరోనా..!

కుటుంభంలో ఒకరి నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు కుటుంభం మొత్తం ఇబందిపడుతుంది. వివరాలలోకి వెళితే రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ కుటుంబంలోని 11 మందికి కరోనా సోకింది. రామ్‌గంజ్‌కు చెందిన ఓ వ్యాపారి మార్చి 12న ఒమన్‌ నుంచి తిరిగివచ్చారు. ఢిల్లీ నుంచి సొంతూరు చేరుకున్న మరునాడు స్నేహితుడితో మార్కెట్‌ వద్ద కొంతసేపుగడిపారు. సుమారు ఆ ఊరిలో 53 మందిని కలిశారు. పక్షం రోజుల తర్వాత ఆ వ్యాపారి, మిత్రుడు, మిత్రుడి కుటుంబంలోని పది మందికి కలిపి మొత్తంగా 12 మందికి కరోనా  పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరింత మందికి వైరస్‌ వ్యాపించి ఉంటుందని అనుమానిస్తున్న అధికారులు ఆ ప్రాంతాన్ని నిర్బంధించి ఇంటింటా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 409 కొత్త కేసులు నమోదయ్యాయని , 7 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క తమిళనాడులోనే  110 కొత్త కేసులు నమోదయ్యాయి కాగా భారత్ లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1870 కాగా మరణాల సంఖ్య 56 గా ఉంది.

For All Tech Queries Please Click Here..!
Topics: