గర్భం తర్వాత జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు 5 మార్గాలు

Saturday, December 15, 2018 10:12 AM Lifestyle
గర్భం తర్వాత జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు 5 మార్గాలు

ప్రసవానంతరం జుట్టు రాలిపోవడం అనే సమస్య బిడ్డ పుట్టిన తర్వాత ఏ రోజున అయినా మొదలు కావొచ్చు. ఒక్కసారి మొదలయ్యాక ఓ ఏడాది వరకు కొనసాగవచ్చు. బిడ్డ పుట్టిన నాలుగో నెలలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని ఈ తాత్కాలిక జుట్టు రాలే సమస్య వేధిస్తుంటే, ఈ కింది చిట్కాలను పాటించడం ద్వారా మీ కురులకు, బిడ్డ పుట్టక ముందు నాటి అందం తీసుకు రావడంతో పాటు పరిమాణం కూడా పెరిగేలా చేయవచ్చు.

  • మీ జట్టును వీలైనంత పొట్టిగా, కురచగా కత్తిరించుకునేందుకు ప్రయత్నం చేయండి. పొడవైన కేశాలను జాగ్రత్తగా చూసుకోవడం కొంత కష్టమైన విషయంగానే చెప్పాలి. అది కూడా మీరు నవజాత శిశువుతో ఉన్నప్పుడు. మీ జుట్టును మెల్లగా మృదువుగా దువ్వండి.
  • మీరు బిడ్డకు పాలిచ్చే తల్లి కావడంతో, తప్పనిసరిగా పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉంటారు. దాంతోపాటు జట్టుకు కూడా పోషణ అందించే చక్కని పదార్థాలకు మీ ఆహార మెనూలో చోటివ్వండి. ప్రోటీన్లు కలిగిన గుడ్లు, మాంసం, పన్నీర్ వంటివి ఇందుకు ఉపకరిస్తాయి. ఐరన్, విటమిన్ సి కలిగి ఉండే ఆకు కూరలు, బీటా కెరోటిన్ కలిగిన క్యారెట్లు, ఒమేగా 3 యాసిడ్స్, మెగ్నీషియం కలిగిన చేపలు తీసుకోవడం మంచిది. ఫ్లావనోయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన తాజా ఆకుకూరలు, కూరగాయలు జుట్టు కుదుళ్లను బలపర్చి, ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదపడతాయి.
  • సద్గుణాలు కలిగిన అల్లం, పసుపు వంటి ఆరోగ్యం అందిస్తాయని ఇప్పటికే నిరూపితం అయిన వాటికి, మీ ఆహారంలో చోటు ఇవ్వండి. భృంగ, వేప లతో పోషణ కలిగిన నూనెలతో, మీ మాడుకు మర్దన చేయడం ద్వారా మీ కురులకు మొదళ్ల నుంచి బలం చేకూరుతుంది, తద్వారా జుట్టు దాని పూర్వ స్థితికి చేరుకుంటుంది.
  • మీ బిడ్డను చూసుకోవడంలో బిజీ అయిపోయి సరైన ఆహారం తీసుకోలేని పక్షంలో విటమిన్ సప్లిమెంట్లు ప్రయత్నించండి. ఇవి మీకు ఎంతో ఉపకరిస్తాయి. విటమిన్లు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా జుట్టుకు మేలు చేస్తాయి. మీరు గర్భంతో ఉన్నప్పుడు విటమిన్ బి కాంప్లెక్స్, జింక్, విటమిన్ సి వంటివి తీసుకున్నట్లయితే డాక్టర్ సలహా మేరకు వాటిని తర్వాత కూడా కొనసాగించడం మంచిది.

For All Tech Queries Please Click Here..!