పురుషులు ఉల్లిపాయ రసాన్ని దానితో కలిపి తీసుకుంటే...?

Friday, December 14, 2018 04:41 PM Lifestyle
పురుషులు ఉల్లిపాయ రసాన్ని దానితో కలిపి తీసుకుంటే...?

టమోటా మరియు మిర్చి తర్వాత ఉల్లిపాయ కూరగాయల్లో కెల్లా రారాజు అని అందరికీ తెలిసింది. దాదాపు అన్ని భారతీయ వంటకాల్లో ఉల్లిపాయ తప్పనిసరిగా ఉంటుంది. మద్యం మరియు మాంసం ప్రియులకు ఉల్లిపాయ ముక్కలు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భూమిలోపల పండే ఉల్లిపాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. రోజూ వారి ఆహారంలో ఉల్లిపాయను చేర్చుకోవడంతో పురుషులకు కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం రండి...

  • ఉల్లిపాయ ఒక యాంటీబయోటిక్‌గా పని చేస్తుంది. ఉల్లిపాయను రెండు సమాన భాగాలుగా కట్ చేసి మన పక్కన పెట్టుకుంటే వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బులను దగ్గరికి రానియ్యవు. అంతేకాకుండా వచ్చిన జబ్బులను కూడా నయం చేస్తుంది.
  • ఉల్లిపాయను తరిగిన వెంటనే వాడుకోవాలి. ఎందుకుంటే ఉల్లిపాయ గాలిలోని బ్యాక్టీరియాను ఆకర్షిస్తుంది. కాబట్టి కోసిన తర్వాత చాలాసేపటికి వాటిని మనం తినకూడదు.
  • ఒక స్పూన్ ఉల్లిపాయ రసం, ఒకస్పూన్ ఆవునెయ్యి, అరస్పూన్ తేనెను ఉదయం, మద్యాహ్నం సమయాల్లో చప్పరిస్తూ, రాత్రి సమయంలో పాలు తాగితే పురుషుల్లో స్తంభన సమస్యను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది.

For All Tech Queries Please Click Here..!