భార్యపై చెయ్యేస్తే ఇష్టం లేదంటోంది.. నన్నేం చేయమంటారు..?

Wednesday, July 24, 2019 06:37 PM Lifestyle
భార్యపై చెయ్యేస్తే ఇష్టం లేదంటోంది.. నన్నేం చేయమంటారు..?

ప్రశ్న: నాకు పెళ్లయి రెండేళ్లు అయ్యింది. నేను మీద చేయి వేస్తే నా భార్యకు చిరాకు వస్తుంది. ఏం చెప్పినా అరుస్తుంది. సరదాగా ఉందాం అంటే అలా సినిమాల్లో మాత్రమే ఉంటారు బయట ఉండరు అంటుంది. పెళ్లి జరిగి ఇన్నాళ్లయినా ఒక ముద్దూ ముచ్చట లేదు. అదేమిటని అడిగితే నాకు ఇష్టం ఉండవు ఆ పనులు అని అంటుంది. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా గొడవపడి పుట్టింటికి వెళ్లిపోతుంది. వాళ్ల అమ్మవాళ్లు ఫోన్‌ చేసి అమ్మాయి వచ్చింది ఏదన్నా గొడవా అని కూడా అడగరు. ఇలా నాలుగైదుసార్లు అయ్యింది. ఒకసారి సినిమాకి వెళదాం అంటే వాళ్ల అమ్మవాళ్ల ఇంటికి వెళ్లి తర్వాత ఎప్పుడో సాయంత్రం వచ్చింది. వచ్చాక దాని గురించి అడిగితే మళ్లీ వెళ్లింది కానీ ఇప్పటిదాకా రాలేదు. తాను గానీ వాళ్ల అమ్మవాళ్లు గానీ ఇప్పటికీ ఫోన్‌ చేయలేదు. నన్ను ఏం చేయమంటారు?

సమాధానం: చాలామంది అమ్మాయిలకు ఇటువంటి సమస్య ఉంటుంది పెళ్లి వద్దు అని తల్లిదండ్రులతో చెప్పలేక పెళ్లి చేసుకుని వచ్చిన భర్తను బాధ పెడుతుంటారు. రెండున్నరేళ్లుగా భరిస్తున్నారంటే మీకు ఓపిక చాలా ఎక్కువే. అయితే ఇన్నాళ్లుగా మీరు ఎందుకు వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడలేదు? సమస్య ఇదీ అని చెప్తే వాళ్లన్నా స్పందించేవారు. ఇటువంటి సమస్యలకు వైద్యరంగంలో చికిత్స ఉంది. ఆలస్యం చేయకుండా మీ అత్తమామల సాయం, సలహా తీసుకుని నిపుణులను సంప్రదించండి. అందుకు మీ భార్య సిద్ధపడకపోతే చట్టపరంగా విడాకులు తీసుకుని మరో వివాహం చేసుకునే అవకాశం ఎలాగూ ఉంది.

For All Tech Queries Please Click Here..!
Topics: