రాత్రివేళల్లో వచ్చే ముక్కు దిబ్బడకు అద్భుతమైన వంటఇంటి చిట్కాలు !

Wednesday, March 27, 2019 12:23 PM Lifestyle
రాత్రివేళల్లో వచ్చే ముక్కు దిబ్బడకు అద్భుతమైన వంటఇంటి చిట్కాలు !

ముక్కు దిబ్బడను కలిగి ఉన్నవారు చాలా ఇబ్బందిపడుతూ ఉంటారు. ముఖ్యంగా రాత్రి సమయంలో మీ ముక్కు దిబ్బడ కారణంగా సరిగ్గా శ్వాసక్రియ ఆడకపోవడం వల్ల మీ నిద్రకు భంగపాటు తప్పదు. ముక్కు దిబ్బడకు సంబంధించిన అనేక ప్రకృతి చికిత్సా మార్గాలను మన పూర్వీకులు అనుసరించేవారు, ఈ చికిత్స విధానాలు పూర్తిగా ప్రకృతి సిద్ధమైనవిగాను మరియు ఒక్క రాత్రిలో మీ ముక్కు సహజమైన స్థితికి చేరుకునేలా చేయగలవు. అటువంటి ప్రకృతి చికిత్సా మార్గాల నుంచి కొన్నిటిని మనం తెలుసుకుందాం.

influenza, సైనస్ వంటివి ఊపిరికి సంబంధించిన వివిధ శ్వాసకోశ వ్యాధులకు చికిత్స చేయుటకు ఆవిరిని పట్టడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. సైనస్ వలన మీకు అధిక తలనొప్పిని కలుగుతుంది. ఆవిరి పట్టడం వల్ల మీకు సైనస్ నుంచి కొంత విముక్తి కలుగుతుంది. మంచి ఫలితాలను పొందటం కోసం వేపాకు లేక జండూబాల్మ్ వంటివి కూడా ఆ వేడి నీళ్లల్లో వాడవచ్చు.

వెల్లుల్లికి అనేక ఔషధ ప్రయోజనాలున్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ముక్కు దిబ్బడను వదిలించుకోవటానికి వెల్లుల్లి రెబ్బలను తినడం, వెల్లుల్లి సూప్ తయారుచేసుకొని త్రాగటం వల్ల సరైన ఉపశమనాన్ని పొందగలరు. పెద్ద ఉల్లిపాయ వాసనను పీల్చడం వల్ల కూడా మీ ముక్కులో శ్వాసకు అంతరాయంగా ఉన్న అనేక అడ్డంకులను తొలుగుతా

ప్రతిరోజూ ఒక కప్పు అల్లంటీ త్రాగటం వల్ల మీరు ఉత్తమమైన ఫలితాలను పొందగలరు. మీ నాసికా రంధ్రాలలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు ఇది అత్యంత ఉత్తమమైన మార్గంగా చెప్పవచ్చు. అల్లం చాలా రకాల ఔషధ విలువలను కలిగి ఉంది మరియు మీకు తక్షణ ఉపశమనమును కూడా కలుగుతుంది.

For All Tech Queries Please Click Here..!