అల్లంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Thursday, December 6, 2018 10:22 PM Lifestyle
అల్లంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

నోరూరించే చికెన్ మరియు మటన్ వంటకాలకు అసలైన రుచి రావాలంటే అల్లాన్ని విధిగా వాడుతారు. వంటిట్లో ఎప్పడూ అందుబాటులో ఉండే అల్లాన్ని తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. దీంతో అల్లాన్ని పలు రకాల పదార్థాలతో అప్పుడప్పుడూ తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్లు మరియు ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అల్లంతో కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం రండి...

  • అల్లంలో విటమిన్స్‌, మాంగనీస్‌, కాపర్‌ వంటి విలువైన పోషకాలు మెండుగా ఉన్నాయి. ఇవి మన శరీరంలోని అనేక జీవక్రియలను క్రమబద్దీకరిస్తుంది
  • అల్లం రసంలో నాలుగు చుక్కల తేనె కలుపుకొని తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.
  • అల్లం ఎన్నో రకాల నొప్పులను నివారిస్తుంది కొన్ని అధ్యయనాల్లో తేలింది.
  • కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచడం మరియు మైగ్రేన్‌ వంటి తలనొప్పులకు ఉపశమనం కలిగిస్తుంది.
  • వర్షాకాలంలో కప్పు అల్లం టీ తాగితే ఎంతో సాంత్వన చేకూరుతుంది. వర్షాల వల్ల వచ్చే జలుబు, దగ్గు, వికారం, మలబద్ధకం వంటి ఎన్నో సీజనల్‌ రోగాలకు ఇది మంచి ఔషధం.