గాయపడిన విజయ్ దేవరకొండ

Monday, December 17, 2018 05:20 PM Entertainment
గాయపడిన విజయ్ దేవరకొండ

షూటింగ్ లో విజయ్ దేవరకొండ కు గాయాలు.

ప్రస్తుతం తెలుగులో మంచిఊపు మీద ఉన్న హీరో విజయ్ దేవరకొండ.వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈయన కనీస విశ్రాంతనేదే లేకుండా ఒక సినిమా తరవాత ఒక సినిమా చేస్తూ ఉన్నాడు.ఇప్పుడు భరత్ కమ్మ దర్శకత్వం లో రశ్మికా సరసన డియర్ కామ్రెడ్ చిత్రంలో కాకినాడలో బిజీగా షూట్ లో ఉన్నాడు.

అయితే రైల్వే స్టేషను లో ఓ రైలెక్కే సీన్ షూట్ చేస్తూండగా కొద్దిగా స్లిప్ అయి జారిపడిపోయాడు వెంటనే సిబ్బంది అప్రమత్తం తో ఆయన సేఫ్అయ్యాడు,తనకు ఎలాంటి ప్రమాదం లేదని ఆయన తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.

ఈయన ఆయన గాయపడిన ఫొటోతో పాటు జీవితం లో ఎది ఊరికే రాదు.అప్పుడప్పుడు జరిగే గాయాలు కుడా సెలబ్రెట్ చేసుకోవాలని రాయడం గమనార్హం.