బన్నీ సినిమాలో రంగమ్మత్త

Wednesday, September 25, 2019 10:49 AM Entertainment
బన్నీ సినిమాలో రంగమ్మత్త

బుల్లి తెరపై యాంకర్లలో అనసూయ మంచి పేరు సంపాదించుకుంది. జబర్దస్త్ యాంకర్ గా తన హవాను కొనసాగించి అందరికి దగ్గరయింది. ఇకపోతే ఈమె బుల్లి తెరపై మంచి పేరు వల్ల ఆమెకు సినిమా ఆఫర్లు కూడా వచ్చి పడుతున్నాయి. జబర్దస్త్ షో లో ఈమె వేసే హాట్ డ్రెస్సులు అందరిని ఆకట్టుకున్నాయి. దానితో యూత్ ఫాలోయింగ్ కూడా ఈమెకు చాలా ఉందనే చెప్పాలి. ఇప్పుడు అను టీవీ షోలతో పాటుగా సినిమాలలో కూడా నటిస్తుంది. రంగస్థలం సినిమాతో నటిగా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి రంగమ్మత్త గెటప్ లో నటించి అందరి అభిమానాన్ని చూరగొంది. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆమెకు మంచి పేరు కూడా వచ్చింది. ఇంకేముంది సినిమా హిట్ అయితే ఆ తర్వాత సినిమాలలో నటించడానికి వరుస ఆఫర్లు వస్తుంటాయి.

అలా మొదలైనా అను సినీ ప్రస్థానం ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తుంది. నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో కూడా నటించి మంచి పేరును సంపాదించింది. క్షణం, కథన వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఆ రెండు సినిమాలు ఆమెకు మంచి పేరును తీసుకు రాలేక పోయాయి. అయినా కూడా జోరు మాత్రం ఎక్కడ తగ్గలేదు. హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వకుండా చేస్తుంది. విషయానికొస్తే. బన్నీ, సుక్కు కామినేషన్లో వస్తున్న ఓ సినిమాలో అను ఫుల్ లెంగ్త్ ఉన్న పాత్రలో కనిపించనుంది. సుక్కు దర్శకత్వం అను రంగస్థలం సినిమాలో నటించింది ఆ సినిమా హిట్ అయ్యింది. మళ్ళీ సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది.ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అను అసలు పెట్టుకుంది. మరి ఆమె అసలు నెరవేరుతాయి లేదో చూడాలి.

For All Tech Queries Please Click Here..!
Topics: