ఆ సినిమా చేయడమే నా కెరీర్‌లో చేసిన అతి పెద్ద తప్పు సంచలన వ్యాఖ్యలు ..!

Friday, May 10, 2019 12:00 PM Entertainment
ఆ సినిమా చేయడమే నా కెరీర్‌లో చేసిన అతి పెద్ద తప్పు సంచలన వ్యాఖ్యలు ..!

గజినీ సినిమా అన్నీ భాషల్లో ఎంత పెద్ద హిట్టో మన అందరికి తెలిసిన విషయమే. అయితే ఆ సినిమాలో నయన తార సెకండ్ హీరోయిన్గా నటించింది. అయితే దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు తన పాత్ర గురించి ఒకలా చెప్పి చివరకు స్క్రీన్‌పై మరోలా చూపించారంటూ నయన్ ఆవేదన చెందింది. తన కెరీర్‌లో 'గజినీ' సినిమా చేయడమే ఓ చెత్త నిర్ణయం అని నయన్ ఘాటు వ్యాఖ్యలు చేయటం గమనార్హం. తన పాత్ర పరిధిని చాలా కుదించేసి ఇందులో చూపించారని ఆమె చెప్పారు, గజినీ సినిమా అనుభవం తర్వాత పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్త పడ్డానని చెప్పుకొచ్చింది. అదే 'చంద్రముఖి' సినిమా విషయానికొస్తే అందులోనూ తాను చిన్న పాత్రే చేసినప్పటికీ మంచి స్క్రీన్ ప్రెసెన్స్ చేశారని, ఆ సినిమా తనకు మంచి పేరు తీసుకొచ్చిందని తెలిపింది నయనతార.

దీనిపై మురుగదాస్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. కెరీర్ పరంగా అంచెలంచెలుగా ఎదిగిన నయనతార నేటికీ తన కతాలో మంచి హిట్స్ వేసుకుంటూనే వుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో నటిస్తోంది. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన అదే మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్' సినిమా సెట్స్‌పై కదులుతోంది. ఇవేకాక ''మిస్టర్ లోకల్", "తలపతి 63'' చిత్రాల్లో నటిస్తోంది.

For All Tech Queries Please Click Here..!