మరో శ్రీ రెడ్డి.. నన్ను లైంగికంగా వాడుకుని మోజు తీరాక

Saturday, March 21, 2020 10:56 AM Entertainment
మరో శ్రీ రెడ్డి.. నన్ను లైంగికంగా వాడుకుని మోజు తీరాక

తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒకటి ఉందని. అవకాశాల కోసం అమ్మాయిలను పడుకోడానికి పిలుస్తున్నారని అప్పటి వరకు వినడమే కానీ చూసింది లేదు. ఎవరూ బయటికి వచ్చి చెప్పింది లేదు. కానీ ఈ ట్రెండ్‌కు తెరతీసిన ముద్దుగుమ్మ శ్రీ రెడ్డి. టాలీవుడ్‌లో ఆఫర్ల పేరుతో అమ్మాయిలను శారీరకంగా వాడుకుంటున్నారని ఈమె బయటికి వచ్చి బట్టలు విప్పేసి మరి రచ్చ చేసింది. ఈమె రెండేళ్లుగా చేస్తున్న పోరాటం ఏమో కానీ అమ్మడికి పాపులారిటీ మాత్రం బాగానే వచ్చేసింది. ఇప్పుడు శ్రీ రెడ్డి వారసురాలు మరొకరు కూడా వచ్చేసింది.

అవకాశాల పేరుతో తనను లైంగికంగా వాడుకున్నారని ఓ తమిళ హీరోయిన్ మీడియా ముందుకొచ్చింది. ఆమె పేరు ఎలక్కియా. ఈ నటి ఇప్పుడు కోలీవుడ్‌ను షేక్ చేస్తుంది. తనను చాలా మంది దర్శకులు, హీరోలు శారీరకంగా అనుభవించారని సంచలన వ్యాఖ్యలు చేసింది. టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో ఎక్కువగా ఎక్స్‌పోజింగ్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఎలాక్కియా ఇప్పుడు ఏకంగా లైంగిక ఆరోపణలు అంటూ మీడియా ముందుకొచ్చింది. ఇప్పటికే అక్కడ కొన్ని చిన్న సినిమాలు కూడా చేసింది. ఎలక్కియా తాజాగా పలువురు దర్శకులపై ఆరోపణలు చేసింది. కొందరు దర్శకులు తనకి తమ సినిమాల్లో అవకాశాలను ఇస్తామన్నారని. కానీ లైంగికంగా తమకు సపోర్ట్ చేయాలని ఫేవర్ కోరారని చెప్పింది. అవకాశాల కోసం తమకు కావాల్సింది ఇచ్చిన తర్వాత కూడా తనను మోసం చేసారని చెబుతుంది ఈమె. వాళ్లను నమ్మి తాను అన్ని రకాలుగా దోపిడీకి గురయ్యానని వెల్లడించింది ఎలాక్కియా.

Topics: