మా నాన్నని మించిపోతా అంటున్న బుడతడు..

Tuesday, April 2, 2019 04:00 PM Entertainment
మా నాన్నని మించిపోతా అంటున్న బుడతడు..

బాలీవుడ్ఇం ఇండస్ట్రీ సర్కిల్లో తైముర్‌ అలీఖాన్‌ అనే పేరు తెలియనివారుండరు. సైఫ్‌ అలీఖాన్, కరీనా కపూర్‌ ముద్దుల తనయుడే తైముర్‌ అలీఖాన్‌. బయట కనిపించిన ప్రతిసారి ఫోటోగ్రాఫర్లకు పని పెడుతుంటాడు ఈ బుడతడు. వారానికొక్కసారైనా తన కొత్త స్టిల్స్‌తో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంటాడు తైముర్‌. ఆ మధ్య తైముర్‌ బొమ్మలను తయారు చేసి కేరళలో అమ్మకానికి పెట్టారు కూడా. రెండేళ్లు నిండిన ఈ బుడతడు తాజాగా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీకి రెడీ అయ్యాడు. అక్షయ్‌ కుమార్, కరీనా కపూర్‌ నటిస్తున్న లేటెస్ట్‌ సినిమా ‘గుడ్‌ న్యూస్‌’లో చిన్న గెస్ట్‌ రోల్‌ చేయనున్నాడు ఈ చిన్నోడు. పది నిమిషాల పాటు సినిమాలో కనిపిస్తాడట. తన పార్ట్‌ షూటింగ్‌ కూడా పూర్తి చేశాడట తైముర్‌. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఇంకా చాలా సినిమాల్లో కనిపించాలి అని కోరుకుందాం.

For All Tech Queries Please Click Here..!