భయపెడుతున్న సాహో, పాజిటివా, నెగెటివా, అభిమానుల రియాక్షన్ ఏంటీ ?

Friday, September 27, 2019 09:37 PM Entertainment
భయపెడుతున్న సాహో, పాజిటివా, నెగెటివా, అభిమానుల రియాక్షన్ ఏంటీ ?

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి' తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో భారీ అంచనాల మధ్య ఆగస్టు 30న గ్రాండ్‌గా విడుదలైంది. ఆగస్టు 29 రాత్రి నుండి యూఎస్‌లో భారీగా ప్రీమియర్స్ పడ్డాయి. ఈమధ్య కాలంలో మన తెలుగు సినిమాలు యూఎస్ ప్రేక్షకులను మెప్పించిన దాఖలాలు చాలా తక్కువ. బాహుబలి క్రేజ్ దృష్ట్యా ప్రభాస్ సాహోని విదేశాల్లో పెద్ద ఎత్తున విడుదల చేశారు. మరి అక్కడ ఫ్యాన్స్ ఏమంటున్నారో చూద్దాం. 

సాహో అవుటండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ , ప్రభాస్ ఇంట్రో, యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ 30 నిమిషాలు, గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ, ఆర్ఆర్, టేకింగ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయని.. ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఇటువంటి స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటివరకు రాలేదని యూఎస్ ప్రేక్షకులు అంటున్నారు.  ఆంధ్రప్రదేశ్‌‌లో గత అర్థరాత్రి కొన్నిచోట్ల షోలు వేశారు. తెలంగాణాలో ఈ ఉదయం నుండి సాహో సందడి స్టార్ట్ అయ్యింది.   మరి కాసేపట్లో పూర్తి రివ్యూ రానుంది.

ఇక విజయవాడలో ప్రివ్యూ షో చూసి బయటకు వస్తున్న ప్రేక్షకులు సూపర్‌గా సినిమా అన్నారు. యాక్షన్, థ్రిల్లింగ్ తో పాటు ప్రభాస్ నటన చాలా బాగుందని, ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయని అన్నారు. మొదట్లో కొంచెం స్లోగా ఉన్నా.. సెకండాఫ్ అదిరిపోయిందని 30 నిముషాల క్లైమాక్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచిందని సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

 ప్రభాస్ తెలుగు ఇండస్ట్రీని హాలీవుడ్ రేంజ్‌కు తీసుకువెళ్లారని అన్నారు. ఒక ఫైట్ గంటన్నర తీశారని.. చాలా గొప్పగా చెప్పుకోవచ్చని.. జై సాహో అంటూ నినాదాలు చేశారు. మొత్తం మీద చూసుకుంటే ‘సాహో’ చిత్రంపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. హైప్ క్రియేట్ చేసినంతగా సినిమా లేదని కొందరు, హాలీవుడ్ రేంజ్‌లో ఉందని మరికొందరు ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సాహో’ సినిమా  ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే, ఆ ఫీడ్‌బ్యాక్ చూస్తుంటే నిజంగా భయమేస్తోంది. పాజిటివ్ కామెంట్ల కన్నా.. నెగిటివ్ ఫీడ్‌బ్యాకే ఎక్కువగా వస్తోంది. ఈ సినిమాకు రూ.350 కోట్లు ఎందుకు పెట్టారంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అంత పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టేంతగా కథ, కథనాలు దీనిలో ఏమున్నాయని అడుగుతున్నారు. 

For All Tech Queries Please Click Here..!