జబర్దస్త్ కిరాక్ ఆర్పీ కోసం రష్మీ సంచలన నిర్ణయం...?

Monday, September 23, 2019 09:05 AM Entertainment
జబర్దస్త్ కిరాక్ ఆర్పీ కోసం రష్మీ సంచలన నిర్ణయం...?

సినీ టీవీ పరిశ్రమల్లో వ్యక్తిగతంగా స్వార్థం చూసుకునే వాళ్లే ఎక్కువగా ఉన్నారన్న విషయం మనకి తెలిసిందే. ఏ చిన్న పనికైనా నాకేంటి, నాకెంత అనేవాళ్ళే ఇండస్ట్రీ ఎక్కువగా ఉన్నారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే స్నేహానికి విలువ ఇస్తారు. యాంకర్ రష్మీ కూడా స్నేహానికి విలువ ఇచ్చే మనిషి అని నిరూపించుకుంది. తన కెరీర్ లో చాలా ఇబ్బందులు పడి ఈ స్థాయికి వచ్చానని రష్మీ చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. అలాంటి స్టేజ్ నుంచి వచ్చింది కాబట్టే ఎవరు ఏ సాయం అడిగినా కాదనకుండా చేస్తుంటుంది రేష్మి.

జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ చిన్న ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ పెట్టాడు. అందుకు సంబంధించి ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమానికి రష్మిని ఆహ్వానించాడు. తనతో ఉన్న స్నేహం కారణంగా రష్మిని కంపెనీ ఓపెనింగ్ కోసం రెమ్యునరేషన్ తక్కువ తీసుకోవాలని కోరాడు. అయితే ఇచ్చినమాట ప్రకారం వస్తానని చెప్పిన రష్మి, ఓపెనింగ్ కోసం డబ్బు తీసుకోకుండా ఓపెనింగ్ చేసింది. వాస్తవంగా రష్మి కాల్షీట్ కావాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సిన విషయం తెలిసిందే. జబర్దస్త్ కు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ప్రకారం చూస్తే రష్మికి నెలకు నాలుగు ఎపిసోడ్లకు కలసి 2 లక్షలకు పైగానే వసూలు చేస్తుంది. బైట ఫంక్షన్లకు కాల్షీట్ ఇస్తే ప్రోగ్రామ్ కు 2 నుంచి 4 లక్షల వరకు డిమాండ్ చేస్తుంది. ఆ లెక్కన ఆర్పీ కోసం రష్మి దాదాపు 2 లక్షల రూపాయల్ని త్యాగం చేసింది. ఇదే విషయాన్ని ఎంతో గొప్పగా ఆర్పీ తన వాళ్లందరి దగ్గర ఆనందంగా చెప్పుకుంటున్నాడు. తనుచూసిన అతికొద్దిమంది వ్యక్తుల్లో రష్మి కూడా ఒకరని గొప్పగా చెబుతున్నాడు.

For All Tech Queries Please Click Here..!
Topics: