కారులో సెషన్ తర్వాత ప్యాంట్ వేసుకోలేదా? ట్రోలింగ్‌పై మళ్లీ రకుల్ ప్రీత్ గరం

Tuesday, March 17, 2020 10:32 AM Entertainment
కారులో సెషన్ తర్వాత ప్యాంట్ వేసుకోలేదా? ట్రోలింగ్‌పై మళ్లీ రకుల్ ప్రీత్ గరం

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్‌కు ట్రోలింగ్ గతేడాది తీవ్రస్థాయిలో జరిగింది. ఓ ఫోటోషూట్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను ఊచకోత కోయడం బాధించిందని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. కొందరు నకిలీ అకౌంట్లతో నన్ను టార్గెట్ చేయడం చాలా దారుణమని వాపోయింది. తనపై వస్తున్న ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ.నేను బ్లూ బ్రూలెట్, జీన్స్ వేసుకొని తీసిన ఫోటోషూట్‌లో ప్యాంట్ బటన్ పెట్టుకోకపోవడంపై నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేశారు.

ప్యాంట్ వేసుకోకుండా కారులో నుంచి దిగడంపై ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ అత్యంత వివాదంగా మారింది. కారులో సెషన్ తర్వాత ప్యాంట్ వేసుకోవడం మరిచావా? అంటూ నెటిజన్ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ, కారులో నీ అమ్మ చాలా సెషన్స్ జరిపి ఉంటుంది. అందుకే నీవు అంత ఎక్స్‌పర్ట్‌లా మాట్లాడుతున్నావు అంటూ రకుల్ చేసిన కామెంట్లు దుమారం లేపాయి. తనను ఉద్దేశించిన చేసిన కామెంట్లపై, తాను చేసిన కామెంట్లపై రకుల్ ప్రీత్ స్పందిస్తూ, కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి చేసే దాడుల వల్ల సహనం కోల్పోతాం. అలాంటి వారు ఉన్నంతకాలం మహిళలకు రక్షణ కరువు అవుతుంది. మహిళ భద్రత, సమానత్వం కేవలం డిబేట్‌లకే పరిమితం అవుతుంది.

For All Tech Queries Please Click Here..!