డబ్బు, హోదా ఉందని అలా చేస్తారా, క్రిమినల్ అంటూ రెచ్చిపోయిన పూనమ్ కౌర్

Friday, March 20, 2020 07:11 PM Entertainment
డబ్బు, హోదా ఉందని అలా చేస్తారా, క్రిమినల్ అంటూ రెచ్చిపోయిన పూనమ్ కౌర్

సింగర్ కనికా కపూర్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తోంది. సోషల్ మీడియా మొత్తం కనికా కపూర్‌కు వ్యతిరేకంగా నిలబడింది. కనీస బాధ్యత లేకుండా వ్యవహరించిన కనికాపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. లండన్ నుంచి తిరిగి వచ్చిన కనికాకు కరోనా ఉందని తేలడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో కరోనా పరీక్షలు చేయించుకోకుండా దొంగలా తప్పించుకుని బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటనపై పూనమ్ కౌర్ స్పందించింది.

సింగర్ కనికాకపూర్‌ గతవారం లండన్ నుంచి స్వదేశానికి చేరుకుంది. అయితే ఎయిర్ పోర్ట్ అధికారుల కళ్లుగప్పి కరోనా టెస్ట్‌లు చేయించుకోకుండా తప్పించుకుపోయింది. అక్కడితో ఆగని కనినా, గ్రాండ్ పార్టీకి కూడా హాజరైంది.అయితే కనికాకు కరోనా ఉందని తేలడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు.కనికాను వెంటనే అరెస్ట్ చేయాలన్న డిమాండ్స్ సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆమె రికవరీ అయిన తర్వాత ఎపిడమిక్ యాక్ట్, 1897 సెక్షన్ 3 ప్రకారం కఠినంగా శిక్షించాలని నెటిజన్స్ కోరుతున్నారు. ఇది కచ్చితంగా జాతి వ్యతిరేక చర్యేనని నొక్కి వక్కానిస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!