ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆ క్యారెక్టర్‌కు పాయల్ అయితే కరెక్ట్!

Tuesday, December 11, 2018 11:00 AM Entertainment
ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆ క్యారెక్టర్‌కు  పాయల్ అయితే కరెక్ట్!

తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాలలో ‘యన్‌టిఆర్’ ఒకటి. మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్‌ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. కాగా బాలకృష్ణ ప్రధానపాత్రలో రెండు భాగాలుగా రానున్న యన్‌టిఆర్ చిత్రాలు వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇప్పటికే ఈ చిత్రంలో పలు పాత్రల కోసం రకుల్ ప్రీత్, విద్యాబాలన్, రానా, సుమంత్ లాంటి భారీ తారాగణం ఎంపిక చేసిన క్రిష్.. ఇప్పుడు పాయల్ రాజ్‌పుత్‌ని ఎంపిక చేయ‌డం గొప్ప విష‌య‌మే. ఎన్బికె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ , విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది రెండు పార్టులుగా విడుద‌ల కానుంది.

ఇక ఎన్టీఆర్ నటించిన పలు హిట్ చిత్రాల్లో జయసుధ ఆయనకు జోడిగా నటించింది. వారి జోడికి మంచి క్రేజ్ ఉండేది. అందుకే యన్‌టిఆర్ బయోపిక్‌లో జయసుధకు ప్రాధాన్యత ఉందని .. ఆ పాత్రకు పాయల్ రాజ్‌పుత్ బాడీ లాంగ్వేజ్‌ సరిగ్గా సెట్ అవుతుందనే ఆమెను తీసుకున్నట్లు సమాచారం.