తమ్ముడు ఓటమి పై నాగబాబు సమాధానం...!

Friday, June 21, 2019 04:40 PM Entertainment
తమ్ముడు ఓటమి పై నాగబాబు సమాధానం...!

నాగబాబు జనసేన అభ్యర్ధిగా నర్సాపురం ఎంపీ సీట్ నుండి పోటీ చేసి ఓటమి చెందిన విషయం మనకి తెలిసిందే. అయితే నాగబాబు ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా పవన్ ఓటమి పై తన వ్యక్తిగత అభిప్రాయం కూడా వెల్లడించాడు. తమ్ముడు ఓటమి గురించి మాట్లాడుతూ తాను పవన్ ఓడిపోతాడు అని కలలో కూడ ఎప్పుడూ అనుకోలేదు అని అన్నారు, పవన్ని ఓడించడానికి '200 కోట్లు' ఖర్చు పెట్టారు అనీ అదేవిధంగా పవన్ ఓటమి కోసం అధికార దుర్వినియోగం కూడా చేసారని నాగబాబు వెల్లడించాడు.

అంతే కాకుండా పవన్ ఓటమి కోసం కేంద్ర ప్రభుత్వం కూడా పని చేసిందనీ ఇన్ని శక్తులు ఒకటై పోరాడటం వల్ల పవన్ కి ఓటమి తప్పలేదు అని తన అభిప్రాయం అని అన్నారు. ఇక పవన్ ఫుల్ టైం రాజకీయాలలో కొనసాగుతాడని నాగబాబు అన్నారు.

For All Tech Queries Please Click Here..!