పాటకు నోట్ల వర్షం....!

Sunday, December 16, 2018 06:55 AM Entertainment
పాటకు నోట్ల వర్షం....!

సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో అలరించే పాటలు పాడినా.. నృత్యం చేసినా డబ్బును వెదజల్లడం ఆనవాయితీగా మారిపోయింది. గుజరాత్‌లో ఓ జానపద గాయకుడు పాడిన పాటకు నోట్ల వర్షం కురిసింది. అది కూడా చిన్నా చితకా నోట్లు కాదు.. ఏకంగా రూ.2000, రూ.500 నోట్లు. 
ఆయన తరచూ నోట్ల వానలో తడుస్తూనే ఉంటారట. ప్రముఖ జానపద గాయకుడు క్రితిదాన్ గాద్వీకి జరిగిన ఘన సన్మానమిది. కార్యక్రమం అనంతరం క్రితిదాన్ తనకు వచ్చిన నోట్లను లెక్కిస్తే అవి రూ.కోట్లలో ఉంటాయని సమాచారం.