బిగ్‌బాస్‌ సీజన్‌ 3 విజేతగా రాహుల్ సిప్లిగంజ్

Saturday, November 23, 2019 02:00 PM Entertainment
బిగ్‌బాస్‌ సీజన్‌ 3 విజేతగా రాహుల్ సిప్లిగంజ్

బిగ్‌బాస్‌’ సీజన్‌ 3 విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. రూ.50 లక్షల ప్రైజ్‌ మనీని గెలుచుకున్నాడు. ఫైనల్స్‌లో శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. ఎన్నో అంచనాలతో జూలై 22న 17 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఈ రియాల్టీ షో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అనేక మలుపులు, టాస్క్‌లతో వంద రోజులకు పైగా సాగిన ‘బిగ్‌’ రియాల్టీ షో లో 17 మంది సభ్యుల్లో అంతా ఎలిమినేట్‌ అవగా చివరికి ఇద్దరు మిగిలారు. ఈ ఇద్దరిలో రాహుల్ రూ. 50 లక్షలు గెలుకున్నాడు. యాంకర్, నటి శ్రీముఖి చివరి వరకూ రాహుల్ కు గట్టి పోటీనిచ్చారు.

 ఏమాత్రం అంచనాల్లేకుండా పోటీలోకి దిగిన రాహుల్ ఎన్నోసార్లు ఎలిమినేషన్‌లో నిలిచాడు. ఒకసారి ఫేక్‌ ఎలిమినేషన్‌కు గురైన సినీ గాయకుడు, ‘రంగస్థలం ఫేం’ రాహుల్‌ సిప్లిగంజ్‌ అనూహ్యంగా బిగ్‌బాస్‌ సీజన్‌ త్రీ విన్నర్‌గా నిలిచారు. ఫైనలిస్టులుగా ఉన్న ఐదుగురు.. యాంకర్‌ శ్రీముఖి, సినీ నటుడు వరుణ్‌ సందేశ్‌, డ్యాన్స్‌ మాస్టర్‌ బాబా భాస్కర్‌, టీవీ నటుడు అలీ రజాలను వెనక్కి నెట్టి ప్రైజీమనీ కొట్టేశాడు. 105 రోజుల పాటు సాగిన ఈ రియాలిటీ షోలో ఆదివారం విజేతను ప్రకటించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ నటుడు చిరంజీవి చేతుల మీదుగా రాహుల్‌ రూ.50లక్షల ప్రైజ్‌మనీని అందుకున్నారు. శ్రీముఖి ద్వితీయ స్థానంలో నిలిచారు.

బిగ్‌బాస్-3 షోలో మొత్తం 17 మంది పాల్గొన్నారు. రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్‌సందేశ్, అలీరెజా చివరివరకు కొనసాగారు. ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు వచ్చిన అలీరెజా ఎలిమినేట్ అయినట్టు సినీనటి రాశీఖన్నా, వరుణ్‌సందేశ్ ఎలిమినేషన్‌ను సినీనటి కేథరిన్, నృత్య దర్శకుడు బాబా భాస్కర్ ఎలిమినేషన్‌ను సినీనటి అంజలి ప్రకటించారు.

For All Tech Queries Please Click Here..!