స్పానిష్‌ సినిమా రీమేక్‌లో అనుష్కా శెట్టి.!!

Wednesday, June 5, 2019 04:00 PM Entertainment
స్పానిష్‌ సినిమా రీమేక్‌లో అనుష్కా శెట్టి.!!

స్టార్ హీరోయిన్‌ అనుష్క శెట్టి వరుస సినిమాలకు రెడీ అవుతున్నారు. సైజ్‌ జీరో సినిమా కారణంగా లుక్‌ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ఈఅందాల తార తరువాత సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చి మరలా తన అందమైన ఆకారానికి బాగా కసరత్తు మొదలుపెట్టారు. ఇటీవల బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న సైలెన్స్‌ సినిమాను అనుష్క ప్రారంభించారు, తదుపరి చేయబోయే సినిమాను కూడా లైన్‌లో పెట్టినట్టుగా సమాచారం. స్పానిష్‌ భాషలో హిట్ అయిన ‘జూలియాస్‌ ఐస్‌’ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ చేసేందుకు అనుష్క ఓకె చెప్పారట. తన సోదరి మరణం వెనుక రహస్యాన్ని చేధించేందకు ఓ యువతి చేసిన సాహసాలే ఈ సినిమా కథ. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కబీర్‌ లాల్‌ దర్శకుడిగా మారనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపైనే త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

For All Tech Queries Please Click Here..!