ఫోన్ పాస్‌వర్డ్ చెప్పలేదని భర్తకు నిప్పటించిన ఇల్లాలు

Saturday, January 19, 2019 04:09 PM Crime
ఫోన్ పాస్‌వర్డ్ చెప్పలేదని భర్తకు నిప్పటించిన ఇల్లాలు

స్మార్ట్ ఫోన్ పాస్‌వర్డ్ చెప్పలేదని క్షణికావేశంలో ఈ ఇల్లాలు తన భర్త మీద పెట్రోల్ పోసి నిప్పటించింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలైన ఆ భర్త చికిత్స పొందతూ మరణించాడు. ఈ దారుణమైన ఘటన  జకార్తాలో చోటు చేసుకుంది.

భర్త ఇంట్లో ఏదో పనిలో నిమగ్నమై ఉండగా... ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాలని భార్య పదేపదే వేదించసాగింది. కోపంతో రగిలిపోయిన అతను భార్య మీద చేయి చేసుకున్నాడు. చిలికి చిలికి గాలివానలా ఈ వివాదం తారా స్థాయికి చేరుకోవడంతో కోపంతో రగిలి పోయిన భార్య క్షణికావేశంలో తన భర్త మీద పెట్రోల్ పోసి నిప్పంటించేసింది. అయితే, విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాస్‌వర్డ్ కోసం కాకుండా ఏదో పథకం ప్రకారమే భర్తను అంతమొందించాలనే ఉద్దేశంతో ఈ ఇల్లాలే ఇలా ప్లాన్ చేసి చంపేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!