యువతిని నిర్బంధించి పది రోజుల పాటు గ్యాంగ్ రేప్...!

Sunday, June 23, 2019 03:00 PM Crime
యువతిని నిర్బంధించి పది రోజుల పాటు గ్యాంగ్ రేప్...!

 మంచి చెడూ తెలియని పదహారేళ్ల వయసు తండ్రితో హాస్పిటల్‌లో సాయంగా ఉన్న సమయంలో ఓ యువకుడితో ఏర్పడిన పరిచయాన్ని ప్రేమగా భావించింది. అతని కోసం కన్నవారిని ఉన్న ఊరును వదలి ఊరు కాని ఊరు వచ్చి కామాంధుల చేతిలో చిక్కింది. ఆరుగురు కీచకుల కబంధ హస్తాల్లో చిక్కి పది రోజుల పాటు నరకయాతన అనుభవించింది. శనివారం వారి చెర నుంచి తపించుకొని పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు చాకచక్యంగా ఆ కామాందులని అరెస్ట్ చేసారు.

పది రోజుల క్రితం యువతి ఒంగోలుకు చేరుకుంది. బస్టాండ్‌లో దిగిన వెంటనే రాముకు ఫోన్ చేసింది. అయితే ఫోన్ కలవకపోవడంతో అక్కడే కూర్చొని ఎదురుచూసింది. బాలిక బస్సు దిగినప్పటి నుంచి తనను గమనిస్తున్న ఓ దివ్యాంగుడు ఆమె వద్దకు వెళ్లాడు. రాము తనకు తెలుసని నమ్మబలికాడు. మాయమాటలు చెప్పి బాలికను బస్టాండు సమీపంలోని తన గదికి తీసుకెళ్లాడు. అక్కడికి తన స్నేహితున్ని పిలిచి ఇద్దరూ కలిసి ఆ రాత్రి ఆమెపై అత్యాచారం చేశారు. వారు అంతటితో ఆగలేదు యువతిని దగ్గరలోని మరో గదికి తీసుకెళ్లి అక్కడున్న నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్పగించాడు. అప్పటి నుంచి ఆ నలుగురు ఆమెకు నరకం చూపారు. వంతులవారీగా అత్యాచారం చేశారు. ఆమె ఎదురు తిరిగితే చిత్రహింసలు పెట్టారు. పది రోజుల పాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన బాలిక శనివారం అదును చూసుకొని గదిలోంచి బయటపడింది.

కామాంధుల చెర నుంచి బయటపడ్డ యువతి ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని ఏడుస్తూ కూర్చుంది. అక్కడ పోలీస్ ఔట్ పోస్ట్‌లో ఉన్న ఓ కానిస్టేబుల్ ఆమెను గమనించి విషయం ఆరా తీశాడు. తనపై జరిగిన దారుణాన్ని యువతి చెప్పడంతో పై అధికారికి సమాచారం ఇచ్చారు. యువతి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలుసులు ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు. దివ్యాంగుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అతనిచ్చిన సమాచారంతో నిందితుల్లో ముగ్గురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!