యువతిపై లైంగికదాడి, అతడికి సహకరించిన తల్లిపై..!

Wednesday, June 5, 2019 03:12 PM Crime
యువతిపై లైంగికదాడి, అతడికి సహకరించిన తల్లిపై..!

నాచారంలో ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది, కొడుకు లైంగికదాడికి తల్లి సహకరించింది వివరాలలోకి వెళితే, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడిన యువకుడితో పాటు అందుకు సహకరించిన అతడి తల్లిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈసీఐఎల్‌కు చెందిన యువతి(18) స్థానిక జూనియర్‌ కాలేజీలో రిసెప్షన్‌లో పని చేస్తోంది. ఆమెకు నాచారం హెచ్‌ఎంటినగర్‌కు చెందిన అబ్దుల్‌ మజీద్‌తో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది.

ఈ క్రమంలో  ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పి పలుమార్లు తన ఇంటికి తీసుకెళ్లి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో పెళ్లి చేసుకోవాలని బాధితురాలు నిలదీయడంతో అందుకు నిరాకరించడమేగాక తన వద్ద ఉన్న వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతానని యువతిని బెదిరించాడు. అందుకు  అబ్దుల్‌ మజీద్‌  తల్లి సలేహా సహీన్‌(45) కూడా సహకరించినట్లు యువతి తెలిపింది.  అంతేకాకుండా తన వద్ద నుంచి రూ 60 వేలు నగదు, 7.5 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు అబ్దుల్‌ మజీద్, సలేహా సహీన్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 36 గ్రాముల బంగారం, బైక్, కారు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.

For All Tech Queries Please Click Here..!