శోభనం గదిలో ఫోన్ మోత, భార్య పోర్న్ వీడియోలు చూసి షాక్

Thursday, March 19, 2020 08:45 AM Crime
శోభనం గదిలో ఫోన్ మోత, భార్య పోర్న్ వీడియోలు చూసి షాక్

అమ్మాయి అందంగా ఉందని అబ్బాయివాళ్లు కట్నం కూడా పెద్దగా డిమాండ్ చేయలేదు, పెద్దలు కుదిర్చింది కావడంతో పెళ్లి ఘనంగా జరిగింది, హడావిడి తగ్గిన తర్వాత అసలు కార్యం కోసం ముహుర్తం ఖరారు చేశారు. శోభనం రాత్రి అదో రకం ఉత్సాహంతో గదిలోకి వెళ్లారు. అంతలోనే భర్త ఫోన్ కు వరుసగా వీడియో మెసేజ్ లు వచ్చాయి, ఓపెన్ చేస్తే, అవన్నీ తన భార్య సెక్స్ వీడియోలు,కంగుతిన్న పెళ్లికొడుకు, వెంటనే భార్యను నిలదీశాడు. ఆమె తనకేమీ తెలీదని చెప్పింది. అమ్మాయి తల్లిదండ్రులు కూడా అదే మాట బలంగా చెప్పడంతో, వాళ్ల తరఫున పోరాడేందుకు సిద్ధపడ్డాడా పెళ్లికొడుకు.కానీ ఈలోపే ఆ వీడియోలు పంపిన వ్యక్తి, తన ఫోన్ నంబర్ ను కూడా పంపాడు. జరిగిన తతంగమంతా పూసగుచ్చినట్లు వివరించాడు.

వివరాలలోకి వెళితే ఈ ఘటన బెంగళూరు లో జరిగింది. పెళ్లికి ముందు ఏడు నెలలపాటు వేరొక యువకుడితో కలిసి ఉందని, నిశ్చితార్థం తర్వాత కూడా అతనితో పక్క పంచుకుందని, పెళ్లికి రెండ్రోజుల ముందు కూడా చాటింగ్ చేసిందని పెళ్లికొడుకు ఆరోపించాడు.విషయం మొత్తం బయటపడటంతో ఆ అమ్మాయి ప్లేటు ఫిరాయించింది. ఇద్దరూ కలిసి కావాలనే తన జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, భర్త కాదంటే తాను ఆత్మ హత్య చేసుకుంటానని పోలీస్ స్టేషన్ లోనే ఆందోళనలకు దిగింది. మొత్తంగా పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇస్తూ కేసును ఓ కొలిక్కి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!