ఆన్‌లైన్‌లో చీర ఆర్డర్ ఇచ్చి రూ.లక్ష మోసపోయిన మహిళ..!

Thursday, July 25, 2019 08:25 PM Crime
ఆన్‌లైన్‌లో చీర ఆర్డర్ ఇచ్చి రూ.లక్ష మోసపోయిన మహిళ..!

బాగా ఇష్టపడి ఆన్‌లైన్‌ ఈ-కామర్స్ సైట్‌లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్లో ఓ చీర కొంది. వారం తర్వాత డెలివరీ బాయ్‌ చీర తెచ్చి ఇచ్చాడు. అతనికి రూ.1500 క్యాష్ చెల్లించింది. ఆ తర్వాత పార్సిల్ ఓపెన్ చేసి చూడగా సైట్‌లో చూసిన చీర అద్భుతంగా ఉంది. పార్సిల్‌లో వచ్చింది ఏమాత్రం క్వాలిటీ లేదు. దాదాపు వాడేసిన చీరలా అనిపించింది. రిటర్న్ పంపాలి అని వెంటనే ఆ వెబ్‌సైట్‌లో హెల్ప్‌లైన్ నంబర్ కోసం వెతికింది వెబ్‌సైట్‌లో హెల్ప్‌లైన్ నంబర్ ఆమెకు దొరకకపోవడంతో గూగుల్‌లో ఆ వెబ్ సైట్ పేరుతో హెల్ప్ లైన్ నంబర్ అని సెర్చ్ చేసింది. గూగుల్లో దొరికిన హెల్ప్‌లైన్ నంబర్‌కి కాల్ చేసింది. డోంట్ వర్రీ మేడం, రేపు మా డెలివరీ బాయ్ వస్తాడు చీర రిటర్న్ ఇచ్చేయండి అని కాల్ సెంటర్ నుంచి సమాధానం వచ్చింది. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు మేము పంపే లింక్ ఓపెన్ చేసి పంపండి, మీ డబ్బు డిపాజిట్ చేస్తాం అని అన్నారు. సరేనన్న ఆమె బ్యాంక్ అకౌంట్ నంబర్, నేమ్, డేటాఫ్ బర్త్, ఇలా చాలా వివరాలు ఇచ్చేసింది. ఎట్లాగైనా ఆ చీరను ఇచ్చేసి డబ్బు తిరిగి రాబట్టుకోవాలన్న ఉద్దేశంతో చెప్పకూడని పిన్, పాస్‌వర్డ్ వంటి విషయాలు కూడా అక్కడ రాసేసింది.

వివరాలు ఇచ్చిన కొన్ని నిమిషాలకే ఆమె అకౌంట్ నుంచీ రూ.లక్ష మాయమయినట్లు మొబైల్‌లో మెసేజ్ వచ్చింది. షాక్ తిన్న వెంటనే ఆన్‌లైన్‌లో తన బ్యాంక్ అకౌంట్ లాగిన్ అయ్యి చూసింది. నిజంగానే డబ్బు లేదు. తల బాదుకుంటూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మొత్తం జరిగింది చెప్పి కేసు పెట్టింది, పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు.

For All Tech Queries Please Click Here..!
Topics: