కొడుకు వాడుకొని వదిలేసిన యువతికి మరో వ్యక్తితో పెళ్లి చేసి యావదాస్తిని రాసిచ్చిన తండ్రి

Wednesday, May 22, 2019 11:36 AM Crime
కొడుకు వాడుకొని వదిలేసిన యువతికి మరో వ్యక్తితో పెళ్లి చేసి యావదాస్తిని రాసిచ్చిన తండ్రి

పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వాడు మోసం చేసి వాడుకొని వదిలేశాడు, మోసపోయానని గ్రహించి ప్రియుడి ఇంటి పెద్దల సమక్షంలో న్యాయం చేయాలని కోరింది. ఇద్దరి పెళ్లికి ఇరువురి కుటుంబాలు అంగీకారం తెలిపాయి. కానీ అంతలోనే అనుకోని అలజడి ఆమె ఆశలను చిన్నాభిన్నం చేసింది. తనతో పెళ్లికి ఆ యువకుడు ససేమిరా అన్నాడు. చివరికి సొంత అమ్మానాన్నలు చెప్పినా వినలేదు. దీంతో పుట్టింటివారు ఆ అమ్మాయిని ఇంటి నుండి గెంటేయడంతో ఆ యువతి రోడ్డున పడింది. తన కుమారుడి వల్లే ఆమె జీవితం నాశనం అయ్యిందని గ్రహించిన తండ్రి సుపుత్రుడికి దిమ్మతిరిగే గుణపాఠం చెప్పాడు. బాధిత యువతికి కొత్త జీవితం ప్రసాదించాడు. తను కుమారుడు ప్రేమించి మోసం చేసిన యువతికి తండ్రిలా మారి కన్యాదానం చేశాడు. వేరొక అబ్బాయికిచ్చి ఘనంగా పెళ్లిచేశాడు. అంతే కాదు తన యావదాస్తిని ఆమె పేరున రాసిచ్చాడు. 

షాజి అనే వ్యక్తి కొట్టాయం (కేరళ) జిల్లాలోని తిరునక్కారలో నివసిస్తున్నాడు. ఆయన కుమారుడు ఆరేళ్ల కిందట ఓ యువతిని ప్రేమించాడు. ఆమెను ఇంటి నుంచి తీసుకొచ్చి పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పడు వాళ్లిద్దరు మైనర్లు కావడంతో పెళ్లి ఆగిపోయింది. మేజర్లయ్యాక తానే పెళ్లి చేస్తానని షాజి వాగ్ధానం మాటిచ్చాడు. అనుకున్నట్లుగానే ఆరేళ్లు గడిచిపోయాయి ఇద్దరూ మేజర్లయ్యారు. ఇచ్చిన మాట ప్రకారం తన కుమారుడికి పెళ్లిచేసేందుకు షాజి సిద్ధమయ్యాడు. కానీ అప్పుడే ఆయన కుమారుడు అందరికీ ఊహించని షాకిచ్చాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు.

షాజి కొడుకు మరో యువతితో ప్రేమలో పడ్డాడు. తనతో పాటు కాలేజీలో చదివే ఆ అమ్మాయినే వివాహం చేసుకుంటానని తేల్చిచెప్పాడు. మొదటి ప్రియురాలిని మొహం చాటేశాడు. దిక్కుతోచని స్థితిలో తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది యువతి. ప్రియుడితో వెళ్లిపోయి సమాజంలో తమ పరువు తీసిందని తల్లిదండ్రులు.. కూతురును ఇంటి నుండి గెంటేశారు. ఈ పరిణామాలన్నీ షాజిని తీవ్రగా బాధించాయి. తన కొడుకు వల్ల ఓ అమ్మాయి జీవితం నాశనమవుతోందని తీవ్రంగా మదనపడ్డాడు.

చివరి ప్రయత్నంగా తన కుమారుడిని, ఆ యువతిని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఫలితం లేదు. ఆమెను పెళ్లిచేసుకునే ప్రసక్తే లేదని అతడు తేల్చిచెప్పాడు. దాంతో బాగా ఆలోచించిన షాజి..ఎలాగైనా యువతినికి న్యాయం చేయాలనుకున్నాడు. మంచి సంబంధం చూసి వేరొక అబ్బాయితో యువతికి పెళ్లిచేశాడు. తిరునక్కార మహాదేవ ఆలయంలో బంధువుల సమక్షంలో ఘనంగా వివాహం జరిపించాడు. అంతేకాదు తన ఆస్తినంతా ఆమె పేరున రాసి కుమారుడికి గట్టి గుణపాఠం చెప్పాడు షాజి.

For All Tech Queries Please Click Here..!