నడి రోడ్డుపై భార్యను నరికి చంపిన భర్త

Thursday, December 13, 2018 09:54 PM Crime
నడి రోడ్డుపై భార్యను నరికి చంపిన భర్త

అనుమానం పెను భూతమై ఓ భర్త తన భార్యను అతి కిరాతకంగా నరికిచంపాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని బుట్టాయి గూడలోని బస్టాండ్ ఆవరణంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... సత్యవతి, లెనిన్ భార్య భర్తలు. పులిరామన్న గూడంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సుగా విధులు నిర్వహిస్తున్న సత్యవతి అందరితో కలుపుగోలుగా మాట్లాడేది. అయితే, అందరూ సత్యవతితో చనువుగా మాట్లాడుతోందని లెనిన్ అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగినట్లు తెలిసింది.

గురువారం నాడు డ్యూటీకి వెళ్లిన సత్యవతి సాయంత్రం ఇంటికి వచ్చేటపుడు బుట్టాయి గూడెం బస్టాండులో బస్సు దిగింది. సత్యవతి మీద కక్ష పెంచుకుని, ఎలాగైనా ఆమెని అంతమొందించాలని అప్పటికే కాపుకాసిన భర్త లెనిన్ ఒక్కసారి సత్యవతి మీద కత్తితో దాడి చేసి చేశాడు. కత్తితో తలపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందింది.