మూడు నెలల గర్భిణీని దారుణంగా కడతేర్చిన భర్త

Saturday, February 23, 2019 04:01 PM Crime
మూడు నెలల గర్భిణీని దారుణంగా  కడతేర్చిన భర్త

హైదరాబాద్‌లోని ఆసీఫ్ నగర్‌లో దారుణం జరిగింది. ఓ కిరాయి భర్త తన భార్యను అత్యంత దారుణంగా కడతేర్చాడు. మూడు నెలల నిండు చూలాలు అని తెలిసి కూడా తల మీద బలంగా కొట్టాడు... అంతటితో ఆగకుండా మెడకు ఉరి బిగించి దారుణంగా చంపేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

విజయ్ కుమార్, షాలిని దంపతులు ఆసిఫ్ నగర్‌లో నివాసముంటున్నారు. కుటుంబ కలహాల కారణంగా విజయ్ మరియు షాలినీల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ తరుణంలో షాలిని నిద్రిస్తున్న సమయంలో భర్త విజయ్ అమె తలపై బలంగా కొట్టాడు... దీంతో కుప్పకూలిపోయిన షాలినీని అంతటితో ఆపకుండా చేతులు కట్టేసి మెడకు ఉరి బిగించి చంపేశాడు. అనంతరం విజయ్ కుమార్ స్టేషన్లో లొంగిపోయాడు. కుటుంబ కలహాల కారణంగా భార్యను హతమార్చినట్లు వాంగ్మూలం ఇచ్చాడు.

వియ్ కుమార్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు సంభందించిన పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!