పాకిస్తాన్‌లో హిందూ మత విద్యార్థిని అనుమానాస్పద మృతి, భగ్గుమంటున్న పాకిస్తాన్

Friday, October 11, 2019 09:52 AM Crime
పాకిస్తాన్‌లో హిందూ మత విద్యార్థిని అనుమానాస్పద మృతి, భగ్గుమంటున్న పాకిస్తాన్

ఆర్టికల్ 370 రద్దుతో ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ మరింతగా వేడెక్కిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ కొత్త కొత్త నిప్పు రాజుకుంది. పాకిస్తాన్‌లో హిందూ మత విద్యార్థిని నిమ్రితా చందాని (Namrita Chandani) అనుమానాస్పద రీతిలో మరణించింది. హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు కరాచీ వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ముందుగా ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అనుమానించినప్పటికీ పోలీసులు ఇప్పుడు భిన్న కోణాల్లో విచారణ చేపట్టారు.

ఘోట్కీ తాలూకాలోని మీర్‌పూర్ మథెలోకు చెందిన నిమ్రితా చందాని లార్కానాలోని బీబీ ఆసిఫా దంత వైద్య కళాశాలలో చివరి సంవత్సరం చదువుతూ హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆమె బలవన్మరణానికి పాల్పడలేదని, ఆమెను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. గది లోపల నుంచి గొళ్లెం వేసి ఉండడంతో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని కళాశాల వైస్ చాన్సలర్ డాక్టర్ అనీలా అతౌర్ రహ్మాన్ అనుమానిస్తున్నారు. అయితే తన సోదరిని హత్య చేశారని, మైనారిటీ మతానికి చెందిన తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె సోదరుడు డాక్టర్ విశాల్ సుందర్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. లోపలి నుంచి తాళం వేసిన తన గదిలో మంచంపై పడిఉన్న నమిత్రా చందాని మెడకు తాడు బిగించి ఉంది. ఆమె గదికి తాళం వేసి ఉండటంతో సహ విద్యార్ధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాకిస్తాన్‌లో ఇటీవల మైనారిటీలపై దాడులు పెరుగుతున్న క్రమంలో హిందూ విద్యార్ధిని అనుమానాస్పద మృతి చోటుచేసుకోవడం గమనార్హం.

పోలీసులు మాత్రం పోస్ట్‌మార్టమ్ తర్వాతే నమిత్రా మరణానికి కారణం తెలుస్తుందని చెబుతున్నారు. నమ్రితా మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తైందని, నివేదిక రావడానికి కొంత సమయం పడుతుందని ఈ కేసు గురించి లర్కానాలోని రహ్మత్‌పుర్‌ ఎస్‌హెచ్‌ఓ అసదుల్లా బీబీసీ ప్రతినిధితో తెలిపారు. దర్యాప్తు కోసం ఉన్నత స్థాయి బృందం ఏర్పాటు చేశాం. నిమ్రితా ఫోన్‌ను ఫోరెన్సిక్ నిపుణులకు అప్పగించాం. ఆమె గది తలుపులకు లోపలి నుంచే గడియ పెట్టుంది. ఆమె గొంతుకు నాలుగు వైపులా గుర్తులు ఉన్నాయి. గదికి భద్రతాసిబ్బందితో కాపలా ఏర్పాటు చేశాం'' అని వివరించారు.

ఇదిలా ఉంటే నిమ్రితాను ఎవరో అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమెకు న్యాయం చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ట్విటర్‌లో #JusticeForNimrita అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అయ్యింది.పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖులు కూడా నిమ్రితాకు న్యాయం జరగాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. నిమ్రితాపై అత్యాచారం జరిగిందా, లేదా అన్న విషయంపై పోలీసులు విచారణ జరిపి, వివరాలు వెల్లడించాల్సి ఉందని పాకిస్తాన్‌కు చెందిన పాత్రికేయుడు కపిల్ దేవ్ వెల్లడించారు.

నిమ్రితా అనుమానాస్పద మరణం చాలా బాధ కలిగించింది. అసలు దోషులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నా. మతంతో సంబంధం లేకుండా ఏ పాకిస్తానీ కోసమైనా నా హృదయం స్పందిస్తుందంటూ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ట్వీట్ చేశారు. కాగా ఈ ఏడాది ఆగస్టులో కూడా పాకిస్తాన్‌లో ( Pakistan ) మైనారిటీ మతానికి చెందిన ఒక యువతిపై దాడి జరిగింది. గురుద్వారా తంబు సాహిబ్ గ్రంథి(పూజారి)కు చెందిన 19 ఏళ్ల కుమార్తెను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసి ఆమెను ఇస్తాం మతంలోకి మార్పించారు. తమ కుమార్తెను రక్షించాలంటూ ఆమె తండ్రి ఒక వీడియో సందేశంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ( Imaran Khan ), పారిస్తాన్ చీఫ్ జస్టిస్ ఆసిఫ్ సయీద్, ఖోసాకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

For All Tech Queries Please Click Here..!