భార్యను వివస్త్రను చేసి నరకం చూపించిన సాఫ్ట్‌వేర్ భర్త

Saturday, January 19, 2019 04:45 PM Crime
భార్యను వివస్త్రను చేసి నరకం చూపించిన సాఫ్ట్‌వేర్ భర్త

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రదీప్ మోసపర్తి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఈయనకు హైదరాబాద్‌కు చెందిన అనూపతో మూడేళ్ల క్రితం వివాహమైంది. మంచి ఉద్యోగం... అందుకు తగ్గ శాలరీ అని తమ కూతురు సంతోషంగా ఉండాలనే ఆశతో పెళ్లి జరిపించినపుడు 15 లక్షల నగదు, 12 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. అయితే, పెళ్లయిన కొంత కాలానికే ప్రదీప్ తనలోని శాడిజాన్ని బయటపెట్టాడు. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడంతో ప్రదీప్ సంపాదన బాగానే ఉంది. డబ్బు మీద వ్యామోహంతో అనూపను అదనపు కట్నం కోసం వేధించసాగాడు. ఇదే అదునుగా భావించి, తమ సైకోయిజం మొత్తం అనూప మీద చూపించాడు. కనీసం కన్న తల్లితో కూడా చెప్పుకోలేని విధంగా నరకం చూపించాడు ఈ పైశాచిక భర్త.

విషయం తెలుసుకున్న అనూప తల్లితండ్రులు అల్లుడిని సంతృప్తి పరిచేందుకు ఓ సారి 5 లక్షల రుపాయలు ఇచ్చారు. వేధింపులకు డబ్బులు రాలుతాయని అనుకున్నాడో ఏమో.. కొన్నాళ్లు మంచిగానే ప్రవర్తించాడు. కొంత కాలానికి తనతో పాటు అక్క మరియు బావలతో కలిసి భార్యను హింసించడం మొదలుపెట్టాడు. వంటగది, హాల్, బెండ్రూ ఇలా ఇళ్లు మొత్తం రహస్యంగా సీసీ కెమెరాలను అమర్చి ఇంట్లో ఉన్నంత సేపు నగ్నంగా తిరగాలని వేధించసాగాడు. తన భర్తే కదా అని ఆ ఇల్లాలు అలాగే చేసింది. కొన్నాళ్ల తర్వాత ఆ నగ్న వీడియోలు బయటికి తీసి అదనపు కట్నం తీసుకురాకపోతే ఈ వీడియోలు నెట్టింట్లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. భర్త చేస్తున్న శృతిమించిన ఆగడాలను తట్టుకోలేక తల్లిదండ్రులకు విషయం చెప్పిన అనూప ఎట్టకేలకు భర్తను కటకటాల పాలు చేసింది.

For All Tech Queries Please Click Here..!