అర్ధరాత్రి అస్మన్‌గఢ్‌లో పేలుడు: నలుగురికి తీవ్ర గాయాలు

Sunday, March 1, 2020 10:19 AM Crime
అర్ధరాత్రి అస్మన్‌గఢ్‌లో పేలుడు: నలుగురికి తీవ్ర గాయాలు

నగరంలోని మలక్‌పేట అస్మన్‌ఘడ్‌లో శనివారం అర్ధరాత్రి సంభవించిన భారీ పేలుడుతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ఘటనతో ఆ ఇంట్లో భారీ విధ్వంసమే చోటు చేసుకుంది. అస్మన్‌ఘడ్‌లోని మూడంతస్తుల భవనంలో భవన యజమానితోపాటు సెక్యూరిటీగార్డు అతని కుటుంబం నివసిస్తోంది. శనివారం అర్ధరాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డు ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యింది. దీంతోపాటు ఫ్రిడ్జ్ నుంచి నిప్పు రవ్వలు చెలరేగడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

For All Tech Queries Please Click Here..!