వైద్యులపైనే ఉమ్మేస్తూ రోగుల వికృత చేష్టలు, వ్యాధి విస్తరించేలా చేస్తున్నారు..!

Thursday, April 2, 2020 11:08 AM Crime
వైద్యులపైనే ఉమ్మేస్తూ రోగుల వికృత చేష్టలు, వ్యాధి విస్తరించేలా చేస్తున్నారు..!

మనదేశంలో కరోనావైరస్ నియంత్రణలోకి వస్తున్న తరుణంలో ఢిల్లీలో తబ్లిఘి జమాత్ మత సమ్మేళనం ఇప్పుడు కలకలం రేపింది. ఈ సమ్మేళనంలో వివిధ దేశాలకు చెందినవారు, మనదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొన్నారు. విదేశాలకు చెందినవారికి కరోనావైరస్ సోకి ఉండటంతో సమ్మేళనంలో పాల్గొన్న ఇతర ముస్లింలకు కూడా కరోనా వచ్చింది. వీరంతా తిరిగి దేశంలోని వారి రాష్ట్రాలకు వెళ్లడంతో అక్కడకూడా చాలా మందికి వ్యాపించింది. దీంతో కేంద్రం తీవ్రంగా స్పందించింది. నిజాముద్దీన్ తబ్లిఘి జమాత్ మర్కత్‌లో ఉన్న 2,361 మందిని గత 36 గంటల్లో అక్కడి నుంచి ఖాళీ చేయించింది.

వీరిలో చాలా మందిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. అయితే, వీరు ఉద్దేశపూర్వకంగా చికిత్స అందిస్తున్న వైద్యులతో అభ్యంతకరంగా వెకిలిగా ప్రవరిస్తున్నారు. వైద్య సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించడంతోపాటు దూషణకు దిగుతున్నారని అధికారులు అంటున్నారు. ఆహారం విషయంలోనూ అనుచిత డిమాండ్లు చేస్తున్నారని చెప్పారు. మర్కజ్‌ నుంచి వచ్చిన కరోనా బాధితులు క్వారంటైన్ సెంటర్ ప్రాంగణమంతా ఉమ్మివేశారని, అంతేగాక, వైద్యులు, సిబ్బందిపై ఉమ్మివేశారని దీపక కుమార్ తెలిపారు. హాస్టల్ బిల్డింగ్ అంతా తిరుగుతూ ఇలా చేస్తున్నారని చెప్పారు.

For All Tech Queries Please Click Here..!
Topics: