పదేళ్ల కూతురుపై ప్రతి రోజూ అత్యాచారం... గర్భం దాల్చిన ప్రతిసారీ పిడుగుద్దులతో...

Thursday, May 16, 2019 05:13 PM Crime
పదేళ్ల కూతురుపై ప్రతి రోజూ అత్యాచారం... గర్భం దాల్చిన ప్రతిసారీ పిడుగుద్దులతో...

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కూతురి పాలిట కామపిశాచి అయ్యాడు. పాము తన గుడ్లను తానే తింటుందన్నట్లు అతి దారుణానికి పాల్పడ్డాడు. ఒకటి, కాదు రెండు కాదు.. ఏకంగా వందల సార్లు ఆ బాలిపై అత్యంత పాశవికమైన దారుణానికి పాల్పడ్డాడు. తన కూతురు పదేళ్ల వయసు ఉన్నప్పటి నుండే ఈ అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. చెప్పుకోవడాని సైతం అత్యంత అమానవీయమైన ఈ ఘటన ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో చోటుచేసుకుంది. బాలిక తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి మరో పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులు బాగానే ఉన్నా ఆ తర్వాత ఆ కామాంధుడు 41 ఏళ్ల వయస్సులో తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. పదేళ్ల వయసు ఉన్నపుడు ఆ బాలికపై అత్యాచారం చేయడం మొదలు పెట్టాడు. ప్రతి రోజూ ఆమెను బలవంతంగా ఒక గదిలోకి తీసుకెళ్లి రేప్ చేసేవాడు. అరిస్తే దారుణంగా చితకబాదేవాడు. గర్భం వచ్చిన ప్రతిసారీ అబార్షన్ చేయించుకోవాలని పట్టుబట్టేవాడు. కాదంటే.. కడుపుపై పిడిగుద్దులు వర్షం కురిపించి గర్భస్రావం అయ్యేలా చేసేవాడు. అలా ఆరేళ్ల పాటు ఆ బాలికకు నరకం చూపించాడు. బాలిక 15 ఏళ్ల వయసు ఉన్నపుడు గర్భం దాల్చి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. పసిబిడ్డ గుక్కపెట్టి ఏడుస్తున్నా వదలని ఆ కామాంధుడు బిడ్డను పక్కనే ఉంచుకొని బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ బాలిక పదహారేళ్ల వయసులో ఉన్నపుడు ఇంట్లో నుంచి పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ప్రస్తుతం ఆమె వయసు 19 ఏళ్లు. గతాన్ని తలుచుకుంటూ మానసికంగా కుంగిపోతోంది. చచ్చిపోవాలని ఉన్నా తన నాలుగేళ్ల కుమారుడి కోసమైనా బతకాలని నిర్ణయించుకుంది. ఈ కేసు బ్రిస్బేన్ జిల్లా కోర్టు న్యాయమూర్తి వద్దకు రాగా, ఆయనతో పాటు అధికారులంతా విస్మయానికి గురయ్యారు. ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉండకూడదని, నిందితుడికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

For All Tech Queries Please Click Here..!