పెళ్ళైన మూడు రోజులకే...

Sunday, December 16, 2018 06:10 PM Crime
పెళ్ళైన మూడు రోజులకే...

మూడుముళ్ల బంధం మూడురోజులకే ముగిసిపోయింది. కాళ్ల పారాణి సైతం ఆరకముందే నవవధువు ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. రామసముద్రం మండలం ఊలపాడు పంచాయతీ గంపనపల్లెకు చెందిన సరస్వతికి పెద్దపంజాణి మండలం రాయలపేట పంచాయతీ లింగమనాయునిపల్లెకు చెందిన మేనమామ జగదీశ్‌తో 12వ తేదీన వివాహం జరిగింది. 13న సరస్వతి అత్తారింటిలో ఉండి 14వ తేదీన గంపనపల్లెకు భర్తతో వచ్చింది. భార్యాభర్తలిద్దరూ పుంగనూరులో సినిమాకు వెళ్లొచ్చారు. శుక్రవారం రాత్రి ఏం జరిగిందో సరస్వతి(19) బాత్‌రూములోకి వెళ్లి గడియపెట్టుకుని ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. పొగలు రావడం గమనించిన కుటుంబ సభ్యులు తలుపును ధ్వంసం చేసి లోపలకు వెళ్లేటప్పటికే సరస్వతి శరీరం 80 శాతం కాలిపోయింది. తిరుపతి రుయాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం సరస్వతి మృతి చెందింది.