అదుపుతప్పి బస్సు బోల్తా

Monday, December 17, 2018 08:00 PM Crime
అదుపుతప్పి బస్సు బోల్తా

కైకలూరు మండలం ఆలపాడు దగ్గర ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. 
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.