తమ్ముడికి ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని ఇంటికి నిప్పంటించాడు!

Tuesday, February 5, 2019 07:36 AM Crime
తమ్ముడికి ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని ఇంటికి నిప్పంటించాడు!

తమ్ముడికి ఉద్యోగం రావడాన్ని జీర్ణించుకోలేకపోయిన అన్న ఇంటికి నిప్పంటించిన ఘటన పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో మానిక్‌చక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 

పోలీసుల కథనం మేరకు మఖాన్ మోందల్, గోవిందా మరియు వికాశ్‌లు అన్మదమ్మలు, ఇద్దరు తల్లితో కలిసి నివశిస్తున్నారు. ఇటీవల జరిగిన కారుణ్య నిమాయకాల్లో తమ్ముడు గోవిందాను ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఈ విషయాన్ని అన్న మఖాన్ మోందాల్ జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర అసూయతో ఆదివారం రాత్రి తన కుటుంబ సభ్యులు నిద్రస్తున్న ఇంటికి అర్థరాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలోకొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తమ్ముడు గోవిందా, అతడి ఇద్దరు కుమార్తెలు, అన్న వికాశ్ సజీవ దహనమయ్యారు. వికాశ్ భార్య, కుమారుడు, కుమార్తె మరియు గోవిందా భార్య మాల్దాలను సమీపంలోని ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. అయితే, మఖాన్ భార్య పుట్టింటికి వెళ్లడంతో ఈ ప్రమాదం నుండి బయటపడగలిగింది. కేసు నమోదు చేసుకున్న మానిక్‌చక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!