సినీఫక్కీలో గంజాయి స్వాధీనం

Saturday, December 15, 2018 12:24 PM Crime
సినీఫక్కీలో గంజాయి స్వాధీనం

కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నాలుగు చక్రాల వాహనాల అద్దాలకు ఉన్న బ్లాక్ స్టికర్ తొలగిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఒక వాహనానికి బ్లాక్ స్టికర్ తొలగిస్తుండగా  గంజాయి ప్యాకెట్లను  పోలీసులు గమనించారు. దీంతో సంబంధిత వ్యక్తులు పారిపోయారు.  ట్రాఫిక్ పోలీసులు వారిని వెంటనే పట్టుకున్నారు. నిందితులు తమిళనాడు రాష్ట్రం తంజావూరుకు చెందిన వారుగా గుర్తించారు. 180కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.