విదేశీ కంపెనీలకు దడ పుట్టిస్తున్న టాటా హ్యారీయర్

Thursday, December 6, 2018 10:57 PM Automobiles
విదేశీ కంపెనీలకు దడ పుట్టిస్తున్న టాటా హ్యారీయర్

దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ విపణిలోకి అతి త్వరలో సరికొత్త 5-సీటర్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. టాటా 2018లో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్‌పో వాహన ప్రదర్శనలో హెచ్5ఎక్స్ (H5X) పేరుతో కాన్సెప్ట్ మోడల్‌ను  ఆవిష్కరించింది. దీని ప్రొడక్షన్ వెర్షన్‌ను "హ్యారియర్" పేరుతో అతి త్వరలో విడుదల చేయనున్నట్లు టాటా గతంలోనే ప్రకటించింది.

టాటా సొంతం చేసుకున్న ల్యాండ్ రోవర్ కంపెనీ యొక్క సాంకేతిక సహకారంతో తొలిసారిగా హ్యారియర్‌ ఎస్‌యూవీని డెవలప్ చేసింది. దీంతో ల్యాండ్ రోవర్ లగ్జరీ కార్లలో ఉండే డిజైన్ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా ఎన్నో లక్షణాలను ఇందులో గమనించవచ్చు. సాంకేతికంగా ఇందులో 2.0-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ ఉంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 138బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

 టాటా మోటార్స్ తమ హ్యారియర్ 5 సీటర్ ప్రీమియం ఎస్‌యూవీని సుమారుగా రూ. 16 లక్షల ప్రారంభ ధరతో పలు రకాల వేరియంట్లలో పరిచయం చేసే అవకాశం ఉంది. ఇది పూర్తి స్థాయిలో విడుదలైతే మార్కెట్లో ఉన్న జీప్ కంపాస్, మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు హ్యుందాయ్ టుసాన్ వంటి ప్రీమియం ఎస్‌యూవీలకు సరాసరి పోటీనివ్వనుంది.