యాంటీ-స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో బజాజ్ ప్లాటినా విడుదల: ధర ఎంతంటే..?

Tuesday, December 4, 2018 04:47 PM Automobiles
యాంటీ-స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో బజాజ్ ప్లాటినా విడుదల: ధర ఎంతంటే..?

బజాజ్ ఇండియా విపణిలోకి సరికొత్త 2018 ప్లాటినా 110 బైకును లాంచ్ చేసింది. సాధారణ వెర్షన్‌తో పోల్చుకుంటే పలు మార్పులు చేర్పులతో పాటు సరికొత్త బ్రేకింగ్ టెక్నాలజీతో వచ్చిన ఈ 2018 ప్లాటినా 110 బైకు ధర రూ. 49,300 లు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నట్లు ప్రకటించారు.

ఇందులో వచ్చిన అతి కీలకమైన ఫీచర్లలో "యాంటీ-స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్" ఒకటి. ముందు మరియు వెనుక బ్రేకుల్లో ఏదేని ఒక బ్రేక్ అప్లే చేస్తే, బ్రేకింగ్ పవర్ రెండు చక్రాలకు సమానంగా అందుతుంది. దీంతో చక్రాలు స్కిడ్ అయ్యి పడిపోయే ప్రమాదాలను నివారించవచ్చు. హోండా టూ వీలర్స్ "కంబైన్ట్ బ్రేకింగ్ సిస్టమ్"(CBS) మరియు టీవీఎస్ "సింక్ బ్రేకింగ్ సిస్టమ్" (SBS) అనే పేర్లతో ఇలాంటి టెక్నాలజీని ఇప్పటికే తమ స్కూటర్లలో అందుబాటులోకి తీసుకొచ్చాయి.

2018 బజాజ్ ప్లాటినా 110 బైకులో సాంకేతికంగా 115సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 8.5బీహెచ్‌పి పవర్ మరియు 9.8ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. బజాజ్ డిస్కవర్ 110 బైకులో కూడా ఇదే ఇంజన్ ఉపయోగించారు. 11-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి గల ఇది లీటరుకు 80కిమీల మైలేజ్‌నిస్తుంది.

సాధారణ వేరియంట్‌తో పాటు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వేరియంట్లో కూడా లభ్యమవుతోంది. రెండు వేరియంట్లలో అదే మునుపటి డిజైన్, పలు రకాల బాడీ గ్రాఫిక్స్ అప్‌డేట్స్, బ్లాక్-కలర్ అల్లాయ్ వీల్స్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి. 

For All Tech Queries Please Click Here..!